బాదం, కొబ్బరిపూత, వెదురుబియ్యం మాలలతో శోభాయమానంగా స్నపనతిరుమంజనం

Alcohol, coconut and bamboo chocolates

Alcohol, coconut and bamboo chocolates

Date:16/09/2018

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలో బాదం, యాలకులు, వట్టివేరు, కొబ్బరిపూత, వెదురుబియ్యం, రోజాపూలు, తులసిమాలల అలంకరణతో శోభాయమానంగా స్నపనతిరుమంజనం జరిగింది.

ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేకమైన మాలల అలంకరణ స్వామి, అమ్మవార్ల తేజస్సును మరింత ఇనుమడింపచేసింది. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాలతో ఈ తిరుమంజనం సాగింది. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ కొబ్బరిపూత, వెదురుబియ్యం మాలలు అలంకరించినట్టు అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ తదితరులు పాల్గొన్నారు.

లెక్మి సేలోన్ ను ప్రారంభించిన నటి రాజ్ పుత్

Tags:Alcohol, coconut and bamboo chocolates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *