ఫ్యామిలీ రెస్టారెంట్ మాటున మద్యం ఘాటు .!

-ప్రభుత్వం మద్యం దుకాణాలలో దొరకని కాస్ట్లీ మద్యం

రెస్టారెంట్ల్లో ఎంఆర్పి కి మించి మద్యం విక్రయం

పల్నాడు ముచ్చట్లు:

మండల కేంద్రమైన రాజుపాలెం గ్రామంలో ఉన్న ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ కు ఫ్యామిలీ రెస్టారెంట్ గా నామకరణం చేశారే గాని,మద్యం షాపును తలపిస్తుంది,రెస్టారెంటు గతంలో మాదిరిగా వైన్స్ షాపులు పక్కనే ఉన్న పర్మిట్ రూములను తలపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.ప్యామిలీ రెస్టారెంట్ అని పొరబాటున ప్యామిలీతో పోతే మద్యం ప్రియులతో నిండి ఉంటుంది,రెస్టారెంట్లో మద్యం నిల్వ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మందుబాబులు చెప్తున్నారు,ఎం ఆర్ పి రేటు కంటె అదనంగా వసూలు చేస్తున్నారని, పక్కనే ఉన్న ప్రభుత్వ వైన్ షాపులో దొరకని 200 ఖరీదు కలిగిన మద్యంతో పాటు, పక్క రాష్ట్రమైన తెలంగాణ మద్యం కూడా ఇక్కడ లభిస్తుందని వారు వాపోతున్నారు. సమయపాలన లేకుండా రెస్టారెంట్ లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ వైన్ షాపుల్లో 200 పైన కలిగినటువంటి కాస్ట్లీ బాటిల్లు దొరకాలంటే గగనమైపోతుందని చెప్తున్నారు.కాని రెస్టారెంట్ లో మాత్రం కాస్ట్లీ మద్యం దొరుకుతుంది, మొదటి నుండి కూడా ఇదే ఆరోపణలు వైన్ షాపులో పనిచేసే సూపర్వైజర్లు ఎదుర్కొంటున్నారని వారు వాపోతున్నారు. షాప్ కు స్టాక్ రావటంతోనే రెస్టారెంట్ యాజమాన్యం అధికార పార్టీ నాయకుల అండబలంతో కాస్ట్లీ సరుకు ను రెస్టారెంట్ కు తరలిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం 11 గంటల లోపు, రాత్రి 9 తర్వాత రెస్టారెంట్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని మద్యం బాబులు చెప్తున్నారు.

 

 

 

సామాన్యుల జేబులకు చిల్లీపట్టంతోపాటు ప్రభుత్వ వైన్ షాపుల్లో కాస్ట్లీమద్యం దొరకవు పోవడంతో అనారోగ్యం ఫాలో అవుతున్నట్లు వారు వాపోతున్నారు.ఒక కేసు మద్యం విక్రయానికి 500 నుండి 2000 వరకు కమీషన్ తీసుకుంటూన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వ వైన్ షాపులో పనిచేసే సూపర్వైజర్ల పంట పండింది. పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న వేళ ఒక్కొక్క పార్టీ వారు కేసుల కొలది మద్యం బాటిల్లు కొనుగోలు చేస్తున్నడంతో సూపర్వైజర్లు అందిన కాడికి దండుకుంటున్నారు,నిబంధన ల ప్రకారం ఒక్కో వ్యక్తికి 3 మద్యం బాటిల్స్ కు మించి అమ్మరాదు,కాని ప్రభుత్వ మద్యం షాపులలో దీనికి విరుద్దంగా నాయకులకూ ఎన్ని కేసులు కావాలో అన్నీ గుట్టు చప్పుడు కాకుండా పంపిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తూన్నాయి.ఒక కేసు మద్యం విక్రయం జరిగిందంటే రూ 500 నుండి 2000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆయా పార్టీల్లోని క్రింది స్థాయి నాయకులు చెవులు కోరుకుంటున్నారు.

 

 

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇరు పార్టీలకు చెందిన అధినేతలు సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో సమావేశాలు మండలానికి కూతవేటు దూరంలో జరగటంతో లెక్కకు మించి మద్యం కేసులు అమ్మకాలు జరిగాయి. దీంతో సూపర్వైజర్లు లక్షల్లో సంపాదించినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. మద్యం బాటిల్స్ కావలసినవారు తెల్ల గోతాలు తీసుకొచ్చుకుంటే కావాల్సినన్ని మద్యం బాటిల్స్ ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో పాటు క్వార్టర్ బాటిల్ కు 10 నుండి 20 వరకు, కేసుకు 500 నుండి 2000 వరకు వసూలు చేసినట్లు ఆయా పార్టీలకు చెందిన చోట నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సామాన్యులకు నాణ్యమైన మద్యం సరఫరా చేయటంతో పాటు అధికరేట్లకు విక్రయాలు జరపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Alcohol is strong as a family restaurant.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *