మద్యపాన నిషేధం అమలుచేయాలి

విశాఖపట్నం ముచ్చట్లు

మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళలు విశాఖలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి… రాష్ట్రాన్ని మధ్యంధ్రప్రదేశ్ గా మర్చేసి మహిళల్ని మోసం చేశారని తెలుగు మహిళలు ఆరోపించారు. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధి విగ్రహం వరకూ పాదయాత్ర చేసారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి మహిళల పుస్తెలు తెంపుతున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారిస్తున్న జగన్ కి… ఆ పాపం ఊరికే పోదని దుయ్యబ ట్టారు. మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తానన్న జగన్… ఇపుడు ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తాడని ప్రశ్నించారు. మహిళా మంత్రులుగా ఉన్న రోజా, విడదల రజని లు దీనికి ఎం సమాధానం చెపుతారని ఎద్దేవా చేశారు. దశల వారీ మద్యపాన నిషేధం అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో మహిళల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.

Tags:Alcohol prohibition should be enforced

Leave A Reply

Your email address will not be published.