Alcohol sales are brewing controversies across borders

సరిహద్ధుల్లో వివాదాలు రేపుతున్న మద్యం విక్రయాలు

-రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్న మహిళలు,గ్రామస్తులు
-కానరాని ఎక్సైజ్ అధికారులు
-శాంతి భద్రతల పరిరక్షణ తలనొప్పిగా మారుతున్న వైనం
-మద్యం షాపు తొలగించకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అప్పయపాళ్యెం వాసులు

Date:10/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలోని ఆంధ్రా-తమిళనాడు సరిహద్ధు ప్రాంతాలుగా ఉన్న దాసుకుప్పం,అప్పయ్యపాళ్యెం,రాచపాళ్యెం,పాలగుంట,చిన్నపాండూరు,సంతవేలూరు గ్రామాల్లో మద్యం విక్రయాలు వివాదాలు రేపుతున్నాయి.ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుండటం భయానికి గురిచేస్తుంటే మరో వైపు మద్యం దుకాణాల వద్ధ జనాలు గుమిగూడుతుండటం ఆందోళనకరంగా మారింది.తమ గ్రామాల్లో మద్యం విక్రయాలు జరపరాదంటూ మహిళలు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు.తమిళనాడు‌ వాసులు అధికసంఖ్యలో మద్యం దుకాణాలకు వస్తుండటంతో కరోనా నియంత్రణ కష్టతరమవ్వటమే కాక కష్టజీవులైన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కడ సోకుతుందోనన్న భయం పల్లెల్లో ప్రశాంతతను దూరం చేస్తుంది.మద్యం షాపులు తాత్కాలికంగా మూసివేసి నప్పటికి అడ్డదారుల్లో మద్యం విక్రయాలు జరుగుతుండటంతో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న పక్కరాష్ట్రాల వారి రాకపోకలు ఆగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.సత్యవేడు శ్రీసిటీ సెజ్ పరిధిలోని అప్పయ్యపాళ్యెంలో మద్యం షాపు ఎత్తివేయాలంటూ మహిళలు,గ్రామస్తులు వరుసగా రెండవరోజు నిరసన కొనసాగించారు.మద్యం దుకాణాల వద్ధ జరుగుతున్న నిరసనలను అదుపుచేసి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసులకు తలనొప్పిగా మారింది.సంఘటనా స్థలానికి చేరుకున్న శ్రీసిటీ సిఐ జగదీష్ నాయక్ గ్రామస్తులకు సముదాయించే ప్రయత్నం చేశారు.అయినప్పటికి నిసరన విరమించకపోవడంతో లాఠీ ఛార్జ్ చేస్తాము,కేసులు పెడుతామని హెచ్చరించడంతో గ్రామస్తులు,మహిళలు ఆగ్రహానికి లోనౌయ్యారు.ఉన్నతాధికారులతో‌ చర్ఛించి మద్యం షాపు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సిఐ భరోషా ఇవ్వడంతో మహిళలు‌ వెనుతిరిగారు.అప్పయ్యపాళ్యెం లో మద్యం షాపు తొలగించకుంటే దుకాణం ఎదుటే ఆత్మహత్యలు చేసుకుంటామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మద్యం దుకాణాల‌ వద్ధ నిరసనలు వెల్లువెత్తుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎక్కడా కానరాక పోవడం ఆందోళనలకు ఊతమిస్తున్నది.ఇప్పటికైనా పరిస్థితులు చేయి దాటక ముందే స్థానిక శాసన సభ్యులు,సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే జరిగే అనర్ధాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు చర్ఛించుకుంటున్నారు.

కోయంబేడు మార్కెట్ కు వెళ్ళి వచ్చినవారి సేకరించి పరీక్షలు

Tags: Alcohol sales are brewing controversies across borders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *