పుంగనూరులో చిన్నారుల ఆరోగ్యం కోసమే-చైర్మన్ అలీమ్‌బాషా
పుంగనూరు ముచ్చట్లు:
చిన్నపిల్లలు ఆరోగ్యవంతులుగా జీవించేందుకే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డికార్తీక్ ఆధ్వర్యంలో టీకా కార్యక్ర మాన్ని చైర్మన్, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ నాగభూషణం క లసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు. చైర్మన్ మాట్లాడుతూ ముందు జాగ్రత్తగా టీకాలు వేయడంతో కరోనాను నియంత్రించగలిగామన్నారు. వైద్యసిబ్బంది సేవలు మరువలేనిదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ రసూల్‌ఖాన్, కౌన్సిలర్లు నరసింహులు, అమ్ము తదితరులు పాల్గొన్నారు.
రూరల్ మండలంలో…
పుంగనూరు రూరల్ మండలంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి బోడేవారిపల్లె, చండ్రమాకులపల్లెలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోమెడికల్ ఆఫీసర్ సల్మాసుల్తాన, వైద్య సిబ్బంది , వైఎస్సార్ ఆర్టీసి మజ్దూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Aleem Basha is the chairman for children’s health in Punganur