ఏపీలో వాహనదారులకు అలర్ట్.
– చేతిలో మొబైల్ ఉంటే చాలు
-డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డులకు సెలవు
అమరావతి ముచ్చట్లు:

వాహనదారులు మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రవాణాశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత మీ లైసెన్స్, మీ బండి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన రవాణాశాఖ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనంతో రోడ్డెక్కిన సమయంలో పోలీసులు ఆపినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఇకనుంచి రవాణాశాఖ మీకు జారీచేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డుల రూపంలో ఉండవు. మీ మొబైల్ ఫోన్‌లో సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసిన పత్రాలే దీనికి సరిపోతాయి. ఈ విషయాన్ని పేర్కొంటూ రవాణాశాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు వాహనదారులకు రిజిస్ట్రేషన్ ఖర్చు ఆదా అవుతుంది. వాహనదారులు లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ. 200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 ఇలా మొత్తం రూ. 225 చలానాతో కలిపి వసూలు చేస్తున్నారు. అయితే, తాజాగా రవాణాశాఖ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో ఇప్పుడు ఆ ఛార్జీలను వసూలు చేయడం లేదు.
ఇప్పటికే లైసెన్సులు, ఆర్సీ కార్డులకోసం డబ్బులు చెల్లించిన వాహనదారులకు మాత్రం త్వరలో కార్డులను అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రవాణాశాఖకు సంబంధించి ‘వాహన్ పరివార్’తో సేవలన్నీ ఆన్‌లైన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి డిజిటల్ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. తాజాగా ఏపీలోనూ ఆ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. తనికీల్లో భాగంగా పోలీసులు మీ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డు అడిగితే.. ఇక నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న పత్రాలను చూపిస్తే సరిపోతుంది. మొబైల్ లో ఏపీ ఆర్టీఏ సిటిజన్ యాప్ ద్వారా మీరు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ స్మార్ట్‌ఫోన్ లేనివారు పేపర్‌పై సంబంధిత పత్రాలను ప్రింట్ తీసుకొని మీ జేబులో ఉంచుకుంటే సరిపోతుంది. వాహనదారులు మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే. రవాణాశాఖ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్//ఏపీఆర్‌టీఎసిటిజన్. ఈప్రగతి.ఓఆర్జీలో ఫాం 5 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకొని ధృవపత్రాన్ని తీసుకోవాలి. లేదా.. ఏపీఆర్‌టీఏసిటిజన్ అనే యాప్‌ను మీ ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ వాహనాలను పోలీసులు ఆపినప్పుడు ఈ యాప్ ద్వారా మీ వాహన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసులు, రవాణాశాఖ, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి…!!
Tags:Alert for motorists in AP.
