భాగ్యనగర వాసులకు అలర్ట్..

అమరావతి ముచ్చట్లు:


అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడటంతో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు, మూడు గంటల్లో హైదరాబాద్ ప్రాంతంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది.ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడినట్లు వెల్లడించింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని తెలిపింది.
ఈ వాయుగుండం తీవ్రంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లోని బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్యన శనివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

 

Tags: Alert for residents of Bhagyanagar..

Leave A Reply

Your email address will not be published.