మానవత్వం చాటుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా  మల్లెల ఆల్ఫ్రాడ్ రాజు

ఎమ్మిగనూరు ముచ్చట్లు:
కరోనా విజృంభిస్తున్న సమయంలో పాపులర్ ఫ్రంట్ సభ్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రాడ్ రాజు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని గాంధీ నగర్ కు  చెందిన వైకాపా నాయకుడు విక్రమ్ గౌడ్ కరోనా బారిన పడి మృతి చెందారు. వీరి అంత్యక్రియలు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా మహమ్మారికి  బలైపోతున్న వారికి  శవయాత్రలో వెంట వుండి, అంత్యక్రియ కార్యక్రమము చివరి వరకు దగ్గరుండి ఎటువంటి ఆటంకం లేకుండా  సేవలందిస్తున్న పాపులర్‌ ఫ్రంట్‌ బృందాన్ని చూసి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కరోనా విపత్తు కాలంలో చనిపోయిన వారికి వారి బంధువులు, రక్త సంబంధికులు కూడా దరి చేరని వేళ, మీకు మేముసైతం సమాజం కోసం మేమున్నామని  కొండంత ధైర్యంతో ముందుండి చివరికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా “పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా” బృందం కొనసాగిస్తున్న సేవలు మానవత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఏమి ఆశించకుండా ఉచిత సేవలు అందిస్తున్న “పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా సంస్థ” మానవత్వానికి చిరునామా అని చెప్పడం లో ఎటువంటి సంకోచం లేదు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా సంస్థ వారు అందిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా వారి బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం ఇవ్వడంతో వారు పీపీఈ కిట్లు ధరించి సంప్రదాయం ప్రకారం శనివారం అంత్యక్రియలు పూర్తి చేసి సేవా సారథులుగా నిలిచారు. వారి సేవలు అభినందనీయం అని ఆల్ఫ్రాడ్ రాజు పేర్కొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Alfred King of Mallela, the Popular Front of India that spreads humanity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *