పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి
విద్యాశాఖాధికారిణి చంద్ర కళ
విశాఖపట్నం ముచ్చట్లు:

ఏప్రిల్ నెల 3వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ జిల్లా విద్యా శాఖాధికారిణి చంద్రకళ తెలిపారు. విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించారు.పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్య హ్నం 12.45 వరకు జరుగుతాయని, విద్యా ర్థులు పరీక్ష తేదీన ఒక గంట ముం దుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఒక రోజు ముందుగా కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని తెలుసు కోవాలని ఆమె సూచించారు.
Tags;All arrangements for class 10 exams are complete
