ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలి

-సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం  ప్రారంభోత్సవం
– ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు

 

సిద్దిపేట  ముచ్చట్లు:

 

ఈ నెల 20 వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు పేర్కొన్నారు. అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలోని ఫైల్స్, సామగ్రిని కేటాయించిన స్పేస్ లోకి యుద్ధప్రాతిపదికన తరలించాలని మంత్రి తెలిపారు. శుక్రవారం ఉదయం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతీ కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.  ప్రభుత్వం శాఖల కు స్పేస్ కేటాయింపులపై జిల్లా కలెక్టర్  వెంకట్రామిరెడ్డి, పోలీసు కమిషనర్  జోయల్ డేవిస్, అదనపు కలెక్టర్  ముజమ్మిల్  ఖాన్, డీఆర్వో  బి చెన్నయ్య, జిల్లా అధికారులతో చర్చించి, శాఖలకు స్పేస్ లను కేటాయించిన భాగాల్లో మీ ఫర్నీచర్, సామాగ్రి తరలించారా లేదా అంటూ కార్యాలయాల వారీగా కలియ తిరిగి ఆరా తీశారు.  ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. పాలనా సౌలభ్యం కోసమే ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: All arrangements must be armored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *