లబ్ధిదారులంతా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలి కమిషనర్ దినేష్ కుమార్, జెసి విదేహ్ ఖరే

నెల్లూరు   ముచ్చట్లు:
నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఈ నెల  3, 4 తేదీల్లో ప్రారంభిస్తున్న శంకుస్థాపన కార్యక్రమాల్లో లబ్ధిదారులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ దినేష్ కుమార్, గృహ నిర్మాణ అభివృద్ధి జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖరే లు కోరారు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ అన్ని శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖరే పాల్గొని లబ్ధిదారులకు ఇంటి స్థలాలను మంజూరు చేసి రానున్న ఉగాది లోపు గృహ నిర్మాణాలు చేపట్టి అందించాలని సూచించారు. నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలివిడతగా 500 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలను అందజేశామని, రేపటి నుంచి 4 వేల మంది చొప్పున అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి స్థలాలు మంజూరు చేయనున్నామని ప్రకటించారు. అర్హులైన లబ్ధిదారుల అందరూ ఇంటి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుశీల, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:All beneficiaries must participate in the cobblestone program
Commissioner Dinesh Kumar, JC Videh Khare

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *