10 lakh donation to SV Pranadam Trust

అన్ని దానాల క‌న్నా అన్న‌దానం మిన్న

టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌

Date:07/12/2019

తిరుమల ముచ్చట్లు:

అన్ని దానాల క‌న్నా అన్న‌దానం చేయ‌డం ఎంతో ఉత్త‌మ‌మైన‌ద‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద భ‌వ‌నంలో శ‌నివారం జ‌రిగిన ఆయుధ పూజలో అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఈవో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్న‌దానం మ‌హాదాన‌మ‌ని, టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం కొన్ని ద‌శాబ్దాలుగా భ‌క్తుల‌కు విశిష్ట‌మైన సేవ‌లు అందిస్తోంద‌ని కొనియాడారు. ప్ర‌తిరోజూ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు విరాళాలు వ‌స్తున్నాయ‌ని, ప్ర‌స్తుతం రూ.1,350 కోట్ల మొత్తం ఉంద‌ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది రూ.141 కోట్ల విరాళాలు వ‌చ్చాయ‌ని, వ‌డ్డీ రూపంలో రూ.79 కోట్లు అందింద‌ని తెలిపారు. గ‌త ఏడాది అన్న‌ప్ర‌సాదాల విత‌ర‌ణ‌కు అయిన ఖ‌ర్చు రూ.99.90 కోట్లు అని తెలియ‌జేశారు. రానున్న రెండు, మూడు సంవ‌త్స‌రాల్లో అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు స్వ‌యం ప్ర‌తిప‌త్తి సాధిస్తుంద‌న్నారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో దాదాపు ల‌క్ష మంది, రద్దీ రోజుల్లో ల‌క్షా 50 వేల మంది వ‌రకు భ‌క్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని ఈవో తెలిపారు. అన్నప్రసాదాల త‌యారీకి రోజుకు 6 నుండి 7 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నామ‌ని, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌త్యేక చొర‌వ‌తో గ‌త రెండు నెల‌ల్లో 55 ట‌న్నుల బియ్యం విరాళంగా అందింద‌ని వివ‌రించారు. గ‌రుడ‌సేవ‌, ర‌థ‌స‌ప్త‌మి, వైకుంఠ ఏకాద‌శి లాంటి విశేషమైన రోజుల్లో పెద్ద సంఖ్య‌లో విచ్చేస్తున్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదం సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు విశేషంగా సేవ‌లందిస్తున్నార‌ని అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో నాగ‌రాజు, క్యాట‌రింగ్ అధికారి జిఎల్ఎన్‌.శాస్త్రి, ఇఇ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.

 

భ‌గ‌వ‌ద్గీత అధ్య‌య‌నంతో జీవ‌న సాఫ‌ల్యం

 

Tags:All donations are given

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *