Natyam ad

అందరి చూపు విశాఖ వైపే

విశాఖపట్టణం ముచ్చట్లు:


ష్ట్రంలో రాజధాని అంశం పొలిటికల్ హీట్‌ను రాజేస్తున్నది. అమరావతి రాజధాని అంటూ నిన్న మెున్నటి వరకు విజయవాడ-గుంటూరు కేంద్రంగా నడిచిన రాజకీయం ఇప్పుడు విశాఖకు షిఫ్ట్ అయిపోయింది. విశాఖ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. ఏపీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఐటీ హబ్.. టూరిజం హబ్ అనే విశాఖ నేడు పొలిటికల్ హబ్‌గా మారిపోయింది. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖనుంచే ఉద్యమ కార్యచరణ మెుదలైంది. దీంతో విశాఖ సర్వం రాజకీయాలకు వేదికగా మారిపోయింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇతర పార్టీలు పోరుబాట పట్టిన సంగతి విదితమే.

 

 

వికేంద్రీకరణపై హైకోర్టు తీర్పు తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు మరోసారి మూడు రాజధానులంటూ విశాఖ కేంద్రంగా జూలు విదిలిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఈనెల 15న గర్జన నిర్వహించబోతుంది. అదే రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం విశాఖలో పర్యటించబోతున్నారు. మరోవైపు అమరావతి రైతులు చేపట్టిన అమరావతి నుంచి అరసవిల్లి పాదయాత్ర సైతం తరుముకొస్తున్న తరుణంలో విశాఖలో గర్జన ఉత్కంఠరేపుతోంది. మరోవైపు అమరావతియే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఈనెల 22న అదే విశాఖలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సదస్సు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆపరేషన్ విశాఖ అన్న కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రైతులు, మహిళలు అమరావతి నుంచి అరసవిల్లికి మహాపాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 600మందితో ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నప్పటికీ హైకోర్టు సాయంతో అనుమతి తెచ్చుకుని మరీ రైతులు పాదయాత్ర చేస్తు్న్నారు. అమరావతిలో మెుదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఈ యాత్ర తణుకు చేరుకుంది.

 

 

Post Midle

అయితే ఉత్తరాంధ్రలోకి మహాపాదయాత్ర అడుగుపెడితే అమరావతి రాజధానిని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారనే సంకేతం వెళ్తుందనే ఆందోళన వైసీపీలో నెలకొంది. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని టీడీపీతో సమా విపక్షాలు సైతం ప్రచారం చేస్తాయనే టెన్షన్ వైసీపీలో నెలకొంది. ఇందులో భాగంగా వరుస రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మహాపాదయాత్రకు కౌంటర్ ఇస్తున్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలో మహాపాదయాత్రకు స్థానిక ప్రజలు కౌంటర్ ఇచ్చారు. మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. గో బ్యాక్ అంటూ నినదించారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాల అభివృద్ధిని బలిపెట్టలేం అంటూ నిరసనప్రదర్శన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పాదయాత్ర విశాఖకు చేరే లోపు భారీ కార్యక్రమం తలపెట్టాలని వైసీపీ వ్యహరచన చేసింది. ఇందులో భాగంగా నాన్ పొలిటికల్ జేఏసీని తెరవెనుక ఉండి ఏర్పాటు చేసింది. ఈ నాన్ పొలిటికల్ జేఏసీ ఈనెల 15న విశాఖలో గర్జనకు పిలుపునిచ్చింది. ఈ గర్జన ద్వారా ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడంతోపాటు అమరావతి రైతుల మహాపాదయాత్రపై వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తుంది. ఆ ప్లాన్ లో భాగంగానే విశాఖ గర్జనను ఇప్పటికే వైసీపీ ఓన్ చేసేసుకుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ ఇతర మంత్రులు మైకుల ముందు విశాఖ గర్జను విజయవంతం చేయండహో అంటూ ఊదరగొడుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహిస్తున్న ఈ గర్జనను విజయవంతం చేయాలని వైసీపీ నాయకత్వం సైతం దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహరచన చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపొందాలని యోచనలో ఉన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలో బలంగా ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ బలంగా ఉంది.

 

 

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో టీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టేందుకు మూడు రాజధానుల అస్త్రాన్ని సంధించింది. ఈ అస్త్రం ఉత్తరాంధ్రలో టీడీపీని ఇరుకున పెట్టే అవకాశం ఉందని భావిస్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీ నామరూపాల్లేకుండా చేయాలన్న ప్రయత్నంలో భాగంగా విశాఖ రాజధానిగా ప్రకటించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఇవ్వడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అంశాన్ని గ్రామస్థాయి వరకు తీసుకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే నాన్ పొలిటికల్ జేఏసీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడికక్కడ మీటింగ్‌లు పెట్టి విశాఖ రాజధానిని అడ్డుకునే వారిని తరిమికొట్టాలంటూ పిలుపులు ఇస్తున్నారు. ముఖ్యంగా రైతుల పాదయాత్ర ముసుగులో వస్తున్న టీడీపీని రాజకీయంగా చితక్కొట్టాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి వారు కూడా పిలుపునిస్తున్నారు అంటే టీడీపీని ఎంతలా దెబ్బకొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత ఒక్కొక్క కీలక నేతలు విశాఖకు రావడం చేస్తు ఉన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడులు విశాఖ కేంద్రంగానే ప్రెస్‌మీట్లు సైతం నిర్వహిస్తున్నారు. అంతేకాదు వికేంద్రీకరణకు మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా విశాఖ కేంద్రంగానే చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిపి ఇటీవలే నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. మరోవైపు విశాఖలో పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి సైతం వికేంద్రీకరణకు మద్దతుగా పార్టీ నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మెుదటి నుంచి అమరావతియే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు..చేస్తూనే ఉన్నారు కూడా.

 

 

 

అంతేకాదు అమరాతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొని మరీ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈనెల 15న విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విశాఖ గర్జనపై పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ల దాడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. పవన కల్యాణ్‌ ట్వీట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గడం లేదు. విశాఖ రాజధాని పేరుతో వైసీపీ విధ్వంసం సృష్టిస్తుందని పవన్ ఆందోళన చెందుతున్నారు. విశాఖ గర్జనను బలంగా వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ ఈ నెల 15నే విశాఖలో పర్యటించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. 15న విశాఖకు చేరుకుని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు, పార్టీ వలంటీర్లతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు. అనంతరం 16న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినతులను పవన్ కల్యాణ్ నేరుగా స్వీకరిస్తారు. 17న ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు జనసేనాని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం చేస్తోంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఈ కార్యచరణను ప్రకటించినప్పటికీ ఈ గర్జనకు కర్త,

 

 

 

ఖర్మ, క్రియ అంతా వైసీపీయే తెరవెనుక అంతా చూస్తుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంత్రులు ఈ గర్జనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే అమరావతి రైతుల కంటే తామే ముందు ఉత్తరాంధ్ర ప్రజల్లోకి వెళ్లి మూడు రాజధానులపై సెంటిమెంట్ రెచ్చగొట్టాలనే లక్ష్యంతో స్కెచ్ వేసింది. ఈ కార్యక్రమం జరిగి తీరుతుంది. ఇంతవరకూ బాగానే ఉంది..అదే రోజు విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. విశాఖ గర్జనను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విశాఖలో చోటు చేసుకోబోయే తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. గతంలో మూడు రాజధానులపై రాజకీయం జోరుగా నడుస్తున్న సమయంలో చంద్రబాబు అమరావతికి సై అన్నారు. అనంతరం ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టేందుకు విశాఖ వెళ్లగా అక్కడ పరాభవం ఎదురైంది. చంద్రబాబుకు వైసీపీ నుంచి నిరసనలు ఎదురయ్యాయి. విశాఖకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వైసీపీ శ్రేణులు విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. దీంతో చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో చంద్రబాబుకు పోలీసులు సీఆర్పీసీ 151 కింద నోటీసులు ఇవ్వడంతో చంద్రబాబు విశాఖపర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లియారు. దీంతో అప్పుడు రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులేమైనా తలెత్తుతాయేమోనన్న ఆందోళణ నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు అధికార, పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Post Midle