Natyam ad

అన్నమయ్య జిల్లా లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు సర్వం సిద్ధం.

– ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్

 

రాజంపేట ముచ్చట్లు:

Post Midle

రాజంపేట పార్లమెంట్ స్థానానికి 18 మంది అభ్యర్థులు పోటీ.రాయచోటి అసెంబ్లీ స్థానానికి 15 మంది , మదనపల్లి స్థానానికి 15, కోడూరు స్థానానికి 15, పీలేరు స్థానానికి 12, రాజంపేట స్థానానికి 12, తంబళ్లపల్లి స్థానానికి 11మంది అభ్యర్థులు పోటీ.పార్లమెంట్ స్థానానికి 15 మందికి పైగా 18 మంది పోటి చేస్తుండటంతో 2 ఈవీఎంలతో పోలింగ్.జిల్లాలో 1609 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్.85 శాతం పోలింగ్ జరిగేలా ఒటర్ల కు అన్నిరకాలుగా అవగాహన కల్పించాం. నియోజకవర్గానికి 1, పార్లమెంటు 2 మోడల్ పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు.మహిళలకు, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు.ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్.

 

 

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా. పటిష్ట భద్రత.మే 2 నుంచి ఒటర్ స్లీప్పుల పంపిణీ.ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు.అభ్యర్థులు కానీ, వారి అనుచర వర్గాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడిన ఉపేక్షించం.

 

Tags:All is ready for general elections in Annamaiya district.

Post Midle