యాధేచ్చగా జల్లికట్టు
చిత్తూరు ముచ్చట్లు:
గుడుపల్లి మండలం 64 పెద్దూరులో జల్లికట్టు నిర్వహించారు. అయినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జల్లికట్టు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీచేసిన ఎవరూ పట్టించుకోలేదు. జల్లికట్టును వీక్షించడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ఎగబడ్డారు. పోలీస్ అధికారులు ఎక్కడా గానీ జల్లికట్టు నిర్వహించకూడదని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.అధికారులు హెచ్చరించిన గ్రామస్తులు జల్లికట్టు నిర్వహిస్తున్న వైనం బయటపడింది. జల్లికట్టులో పాల్గొనేందుకు తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో ఎద్దులను తీసుకువచ్చారు. గ్రామస్తులు జల్లికట్టును నిర్వహిస్తున్నా పోలీసులు, పట్టించుకోకపోవడం విశేషం.
Tags; All jallikattu

