All Muslims cancel Ramadan shopping

ముస్లింలందరూ రంజాన్ షాపింగ్ ను రద్దు చేసుకోండి

-ఆ డబ్బుతో పేదలకు సాయం చేయండి
-ముస్లిం పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్  పిలుపు

Date:08/05/2020

కర్నూలు ముచ్చట్లు:

రంజాన్ మాసంలో ముస్లిం సోదరు లందరూ  తమ రంజాన్ షాపింగ్ ను రద్దు చేసు కొని, ఆ డబ్బును పేద ప్రజలకు సాయం చేయాలని ముస్లిం పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ముస్లిం సోదరులు కులమతాలకతీతంగా తమ పొరుగున ఉన్న పేదలను గుర్తించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు .శుక్రవారం కర్నూలు, నందికొట్కూరు పట్టణాల్లో అబ్దుల్ సత్తార్ తన కుటుంబ సభ్యులతో కలిసి  తన ఇంటి సమీపంలోని 200 మంది పేదలకు కులమతాలకతీతంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు .

 

 

 

ఈ ఏడాది కరోనా విపత్తు వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని కావున ముస్లింలందరూ తమ రంజాన్ షాపింగ్ రద్దుచేసుకుని, ఆ డబ్బును తమ పొరుగున ఉన్న పేదలను గుర్తించి వస్తులేదా ధన రూపేనా పంపిణీ చేయాలని అబ్దుల్ సత్తార్ కోరారు. పేదలకు సహాయం చేస్తే జీవితానికి సార్థకత లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో ఎంతోకొంత పేదలకు పంచి పెట్టాలని మహమ్మద్ ప్రవక్త బోధించార నీ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రపంచ ప్రజలు బయటపడాలని, కరోనా మహమ్మారి నుండి ప్రజలు సురక్షితంగా కోలుకోవాలని ముస్లిం సోదరులు అందరూ తమ ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేయాలని అబ్దుల్ సత్తార్ కోరారు .

 

 

 

ప్రతి ముస్లిం తన ఇంటిలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థన లో ప్రపంచ శాంతి కోసం దువా చేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో  నందికొట్కూరు 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శాలి మియ్యా, కర్నూలు 39 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎండి నయీం అహ్మద్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ లి భాష , ఖాజా కరీముద్దీన్ ,అబ్దుల్ సత్తార్ తల్లి హనీఫ బి, తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసర సరుకులు, కూరగాయలు , కోడిగుడ్లు పంపిణీ

Tags: All Muslims cancel Ramadan shopping

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *