Natyam ad

ముస్లింలు అందరు వైఎస్సార్‌సీపీకి ఓటు వేయండి

పుంగనూరు ముచ్చట్లు:

ముస్లింలు అందరు ఐకమత్యంతో వైఎస్సార్‌సీపీకీ ఓటు వేయాలని రాయలసీమ దర్గాపీఠాధిపతి కెఎస్‌ఎస్‌.నూర్‌బాబా పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన కుమ్మరవీధి , రాతిమసీదువీధిలలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి మిధున్‌రెడ్డి ల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నూర్‌బాబా ముస్లింలతో సమావేశమైయ్యారు. ఆయన మాట్లాడుతూ మత తత్వ పార్టీల విధానాలతో ముస్లింలకు మనుగడ లేకుండ పోతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ముస్లింలకు పూర్తి రక్షణ ఉందన్నారు. ముస్లింల అభివృద్ధికి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సున్నిఅంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లాషరీఫ్‌, హజ్‌కమిటి డైరెక్టర్‌ ఖాదర్‌, నయాజ్‌ , ముస్లిం నేతలు అస్లాంమురాధి, యూసఫ్‌, ఇర్ఫాన్‌, అంజాద్‌, బాబా, ఖాజా, గౌస్‌ఫీర్‌, ఇలియాజ్‌, భక్షు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; All Muslims vote YSRCP

Post Midle