ఎయిమ్స్ కు క్లాసులకు అంతా సిద్ధం

Date:29/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

అత్యుత్తమ వైద్యసేవలకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల ప్రజల చిరకాలవాంఛ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ  ఏర్పాటుతో నెరవేరనుంది. నిమ్స్‌ను ఏర్పాటుచేస్తే అత్యుత్తమ వైద్యసేవలు అందుతాయని పాత 5 జిల్లాలలో పోరాటాలుచేసి అలిసిపోయిన ప్రజల డిమాండ్ కేంద్రప్రభుత్వం నిమ్స్ స్థానంలో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్ ద్వారా నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నిమ్స్ ఏర్పాటవుంతుందనుకుంటే 4సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఔట్ పేషెంట్ విభాగం మాత్రమే దక్కింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 12 రాష్ట్రాలలో భాగంగా తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని పార్లమెంట్‌లో ప్రకటించి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక రూపంలో కావలసిన వనరుల జాబితాను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావల్సిన వనరుల జాబితా అందిన వెంటనే కార్యాచరణ ప్రారంభించి ఎయిమ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాజాగా బీబీనగర్ ఎయిమ్స్ విభాగం ఇన్‌చార్జి, ఎయిమ్స్ భోపాల్ విభాగం డైరెక్టర్ ఈ నెల 16న జారిచేసిన ప్రకటనతో ఎయిమ్స్‌లో వైద్య సేవలందుతాయన్న యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు పరిసర జిల్లాల ప్రజల ఆశలు చిగురించాయి. అందులో భాగంగా కేంద్ర బృందం నిమ్స్ భవనాన్ని పరిశీలించి సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు 2022 లోపు ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నా నిర్ణయం మెరకు బీబీనగర్ ఎయిమ్స్ కళాశాల బాధ్యతలను భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్‌కు అప్పగించారు. అందులో భాగంగా వైద్య విద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు 40 మంది బోధన, బోధనేతర సిబ్బందినియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

 

 

 

 

 

భోదన విభాగంలో కమ్యూనిటీ ఫ్యామిలీ మెడిసిన్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాలలో ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. బోదనేతర విభాగాలలో సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, డిమానిస్ట్రేటర్ల విభాగాలలో నియామకానికి మార్గం సుగమమయ్యింది. జూన్ 5వ తేదీలోపుఅర్హులైనవారు ధరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.కేంద్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రారంభం2018 సంవత్సరం డిసెంబర్ 17న జరిగిన కేంద్ర మంత్రివర్గంలో 750 పడకల అసుపత్రి ఏర్పాటు చేస్తూ 15 విభాగాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఎయిమ్స్ భవన నిర్మాణం, వసతుల ఏర్పాటుకు రూ.1,628కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఎయిమ్స్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్ ఏర్పాటులో భాగంగా వైద్యవిద్యాకళాశాల సీట్ల భర్తీ అయిన వెంటనే వైద్య సేవలందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

జగన్ కేబినెట్ పై చర్చోపచర్చలు

 

Tags: All of the classes are ready for Aims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *