ఇంగ్లీషు మీడియం స్కూల్స్ లో అన్నీ కరువే

All of the English Medium Schools are dirty

All of the English Medium Schools are dirty

 Date:14/07/2018
ఒంగోలు ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్లబోధన విధానాన్ని ప్రభుత్వం అంచెలెంచులుగా అమలు చేస్తోంది.. మందస్తు ప్రణాళిక, కార్యచరణ లేకపోవడంతో ఇంగ్లీషు మీడియం పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే నాణ్యమైన విద్య అదుతున్న భరోసాను ప్రభుత్వం తల్లిదండ్రుల్లో కల్పించలేక పోతోంది. ప్రయివేటు పాఠశాలల్లో కేవలం ఇంటర్‌, డిగ్రీ చదివిన వారితోనే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలోనే బోధిస్తున్నారు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆంగ్ల విద్యా విధానంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు నియామకం, పాఠ్యపుస్తకాల సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ధర్మవరం పట్టణ పరిధిలో ఒక మోడల్‌ స్కూల్‌తో పాటు నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించారు.సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ఎల్‌కేజీ నుంచి ప్రవేశ పెట్టడం వల్ల తల్లిదండ్రులను ఆకర్షించి చిన్నారులను పెద్ద సంఖ్యలో చేర్చుకోవచ్చు అన్నది కొంతమంది అభిప్రాయం. చిన్నారులకు ఐదు సంవత్సరాలు నిండిన తరువాత నేరుగా ఒకటవ తరగతి ఆంగ్ల మాధ్యమంలో చేర్చడం వల్ల వారిలో చురుకుదనం ఎక్కువగా ఉండటమే కాకుండా మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారని పలువురు చెబుతున్నారు. ప్రయివేటు పాఠశాలల దాడి నుంచి తప్పించుకుని ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే ఇంగ్లీషు మీడియం  విధానం తప్పనిసరని స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టడం అంటే మాటలు కాదు. కోట్లు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. ముందుగా ఉపాధ్యాయులకు ఆంగ్లంపై కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగ తులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంతా చేసి విద్యార్థులు రాక పోతే కష్ట మంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వీటన్నింటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ఆంగ్ల బోధన రానున్న రోజుల్లో విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
ఇంగ్లీషు మీడియం స్కూల్స్ లో అన్నీ కరువే https://www.telugumuchatlu.com/all-of-the-english-medium-schools-are-dirty/
Tags:All of the English Medium Schools are dirty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *