పంచాయితీ సెక్రటరీ పోస్టుల పరీక్షలకు అంతా సిద్ధం

All Panchayat Secretary posts are prepared for the exams

All Panchayat Secretary posts are prepared for the exams

 Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకురావాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదైనా ఒక్కటి హాల్‌టికెట్‌తోపాటు వెంట తీసుకురావాలి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫోన్ నెంబర్, పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబరు 10న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
8వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకురావాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదైనా ఒక్కటి హాల్‌టికెట్‌తోపాటు వెంట తీసుకురావాలి. మొత్తం 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 5,69,447 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరందరికీ అక్టోబరు 10న రాతపరీక్ష నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు పేపర్-1, 100 మార్కులకు పేపర్-2 ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు.
* పేపర్-1లో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ స్టడీస్ & మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
* పేపరు-2లో తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టానికి, పంచాయతీరాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
Tags:All Panchayat Secretary posts are prepared for the exams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed