సమస్యలపై అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి

All parties have declared solidarity on the issues
Date:12/02/2019
అమరావతి ముచ్చట్లు:
దేశంలో అన్నిపార్టీలు మన సమస్యలపై సంఘీభావం  ప్రకటించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు అయన టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీ ధర్మపోరాట దీక్షతో చరిత్ర సృష్టించాం.  మోది, బిజెపి విధానాలను ఎండగట్టాం. ఎన్టీఆర్ నుంచి ఏపి భవన్ జాతీయ రాజకీయాలకు వేదిక అయిందని అన్నారు. ఏపి భవన్ నుంచి టిడిపి పోరాటాలన్నీ విజయవంతం అయ్యాయి. జాతీయ స్థాయిలో ఏపి సమస్యలు అజెండా చేశాం. ప్రతిపక్షాల ఐక్యతకు టిడిపి దీక్ష వేదిక అయ్యింది. 12గంటల ఢిల్లీ దీక్ష మన పట్టుదలకు నిదర్శనం.  ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు ఢిల్లీ వేదిక అయ్యింది.  ఐదు కోట్ల ప్రజల హక్కుల సాధనకు నిరసన వేదిక అయ్యింది. రాజకీయ లాభాల కోసమే కొన్నిపార్టీలు గైర్హాజరు అయ్యాయి. దేశం మొత్తం ఉధృతంగా బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మోదికి గౌరవం ఇవ్వలేదని బాధపడుతోంది వైసిపి. మోదికి అవమానమని బాధపడేది బిజెపి, వైసిపి నే అని విమర్శించారు. అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి బాధ అదే. వైసిపి,బిజెపి లది ఒకే బాట,ఒకే మాట అని వ్యాఖ్యానించారు. సంస్కారంపై వైసిపి తో చెప్పించుకునే స్థితి లేదు. రాష్ట్రంలో నిరసనల వెల్లువ మోదిని అవమానించడమా..?  ఐదు కోట్ల ప్రజల హక్కులపై వైసిపి,బిజెపికి బాధ లేదు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ద్రోహంపై ఈ 2పార్టీలు మాట్లాడవు. మోదికి అవమానం జరిగిందని భాధ పడుతున్నారని అయన అన్నారు.
Tags:All parties have declared solidarity on the issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *