పలమనేరు ముచ్చట్లు:
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీక్రోధి నామ ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే వెంకటే గౌడ్. పంచాంగ శ్రవణం చేసి వేద ఆశీర్వచనాలు అందజేసారు వేద పండితులు. శ్రీక్రోధినామ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,నూతన సంవత్సరం అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసాదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటే గౌడ్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: All people should be happy