ఆపరేషన్ ఆదిత్య- ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం
తిరుపతి ముచ్చట్లు:
సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది.తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. మరో 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనున్నది. రేపు ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆదిత్య – ఎల్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి -సి 57 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్ళబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. రాకెట్ ప్రయోగానికి మిషన్ సన్నద్దతా సమావేశం పచ్చ జెండా ఊపింది.

Tags:All set for Operation Aditya- L1 launch
