All stores can be opened

అన్ని దుకాణాలు తెరవచ్చు

#ప్రభుత్వ ఆదేశాలు జారీ
#కొన్నింటికి నిషేధాలు

Date:04/05/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

ఈ రోజు నుంచి దుకాణాల్లో విధి నిర్వహణ చేసుకోవచ్చని బి.కొత్తకోట ఎంపీడీవో జి.సుధాకర్ ఇవాళ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిత్యావసర సరుకులు దుకాణాలు సహా పూలు, పండ్లు, మాంసం ఇతర దుకాణాలన్నీ తెరచి విక్రయాలు ప్రారంభించవచ్చు తెలిపారు. సెలూన్, థియేటర్లు, రాజకీయ పార్టీల సమావేశాలు నిషేధమని చెప్పారు. హోటళ్లను తెరువ వచ్చని అయితే పార్సీల్ ద్వారా మాత్రమే టిఫిన్, భోజనం అందించాలని పేర్కొన్నారు. వీరంతా మాస్కులు ధరించి ఉండాలని, కొనుగోలుదారులు వచ్చినప్పుడు మాస్కులు ధరించి ఉంటేనే వారికి విక్రయాలు జరపాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు

Tags;All stores can be opened

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *