అందరి చూపు అలంపూర్ వైపే

Date:16/03/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
రాష్ట్ర రాజకీయాలు వేడ్కెడటంతో ఆ ప్రభావం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో గల అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు దాడికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం ఏకంగా ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని చకచకగా ఎన్నికల కమిషన్‌కు గెజిట్ విడుదల చేసి పంపారు. దాంతో కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా జిల్లావాప్తంగా మొదటి రోజు ధర్నాలు రాస్తారోకోలు జరిగినప్పటికిని బుధవారం సైతం అదే తరహాలో ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు శ్రీకారం చుట్టారు. అయితే ఆందోళనలు ఎలా ఉన్నప్పటిని అందరి దృష్టి మాత్రం అలంపూర్ నియోజకవర్గంపై పడింది. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యం అని రాజకీయ విశే్లకులు భావిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే సందర్భంలో అలంపూర్ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తాయనే ప్రచారం అప్పుడే ఊపందుకుంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లు ప్రభుత్వంపై దూకుడునే ప్రదర్శించారనే ప్రచారం కూడా ఉంది. పలు సందర్భాల్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా సంపత్‌కుమార్ ఘాటైన విర్శలు సైతం చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇలా జరగడంతో అసలు సంపత్ రాజకీయ భవితవ్యంపై ఆయన ముఖ్య అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలంటూ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయేనని కూడా అప్పుడే చర్చ మొదలైంది.
Tags: All the eyes wake up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *