పెన్షనర్లందరూ పెన్షన్ తీసుకుంటూ వృద్ధాప్యంలో హాయిగా జీవిస్తున్నారు

పెన్షనర్లందరూ పెన్షన్ తీసుకుంటూ వృద్ధాప్యంలో హాయిగా జీవిస్తున్నారు

అమరావతి ముచ్చట్లు:

ఒకసారి వివరాలలోకి వెళదాము.D.S నకారా . ఇండియన్ డిఫెన్స్ సర్వీసులో ఫైనాన్స్ అడ్వైజర్ గా ఉద్యోగం చేస్తూ.. 1972లో రిటైర్ అయిపోయినారు.పెన్షన్ సిస్టం బ్రిటిష్ వారు  అమలులోకి తెచ్చినప్పటికీ కొన్ని కారణాల వలన స్వాతంత్ర్య అనంతరం ఆగిపోయింది.అప్పుడు నకారా  నేను దేశానికి ఎంత సేవ చేసాను కాబట్టి వృద్ధాప్యంలో నేను జీవించడానికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సిందేనంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగినది.ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడం జరిగినది.. వాదనలు ముగిసిన తర్వాత.. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లెజెండరీ జస్టిస్ వైబి చంద్ర చూడ్. డిసెంబర్ 17 1982 సంవత్సరంలో పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని, ప్రభుత్వం పెట్టే బిక్ష కాదని చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగినది… అందుకే ఈ తీర్పును “మాగ్నా కార్టా”ఆఫ్ పెన్షనర్స్ గా.. చరిత్రకెక్కినది..ఆ మహనీయుడు ఆరోజు చేసిన కృషి ఫలితంగా నేడు విశ్రాంత ఉద్యోగులందరూ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు.

 

Tags: All the pensioners are drawing pension and living comfortably in their old age

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *