దేశ ప్ర‌జ‌లంతా సైనికుల వెంటే 

Date:15/09/2020

–  మోడీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ల‌డాఖ్‌లో ఉన్న ప‌రిస్థితిపై  ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు.  దేశ ప్ర‌జ‌లంతా సైనికుల వెంటే ఉంటార‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు.  ఇటీవ‌లే తాను ల‌డాఖ్ వెళ్లిన‌ట్లు చెప్పిన ర‌క్ష‌ణ మంత్రి.. సైనికుల‌ సాహ‌సం, శౌర్యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని, క‌ల్న‌ల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవ‌లో ప్రాణ‌త్యాగం చేశార‌న్నారు. చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదాలు ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  1950 నుంచి రెండు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న‌ద‌ని, కానీ ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయాయ‌న్నారు. ఇదో సంక్లిష్ట‌మైన స‌మ‌స్య అన్నారు. శాంతియుతంగానే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వాస్త‌వాధీన రేఖ వెంట శాంతి, సామ‌ర‌స్యం ముఖ్య‌మ‌ని మంత్రి రాజ్‌నాథ్ అభిప్రాయ‌పడ్డారు. ఎల్ఏసీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశాల మ‌ధ్య సంబంధాల్లో అభివృద్ధి జ‌రిగిన‌ట్లు మంత్రి తెలిపారు.  వాస్త‌వాధీన రేఖ‌(ఎల్ఏసీ)ను స‌రిగా మార్కింగ్ చేయ‌లేద‌ని చైనా భావిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఎల్ఏసీ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితి వ‌ల్ల రెండు దేశాల మ‌ధ్య సంబంధాలపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు.  ఎల్ఏసీపై భార‌త్, చైనాల మ‌ధ్య భిన్నభిప్రాయాలు ఉన్నాయ‌ని,  ఏప్రిల్ నుంచి వాస్త‌వాధీన రేఖ వెంట చైనా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్న‌ట్లు ఆయ‌న త తెలిపారు. దౌత్య‌, సైనిక ప‌ద్ద‌తుల్లో చైనాకు భార‌త్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు.

 

రాజధాని భూముల్లో… ఆ ఇద్దరికి తిప్పలు

Tags:All the people of the country followed the soldiers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *