All the people will feel comfortable when the floor is cold

నేల ‌త‌ల్లి చ‌ల్ల‌గుంటే ప్ర‌జ‌లంతా సుఖంగా ఉంటారు

-తిరుమ‌ల‌లో మొక్క‌లు నాటిన టిటిడి ఛైర్మ‌న్

Date:05/06/2020

తిరుమల ముచ్చట్లు:

నేల త‌ల్లి చ‌ల్ల‌గా ఉంటే వ‌ర్షాలు కురిసి ప్ర‌జ‌లంతా సుఖంగా ఉంటార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌టం కోసం ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని సన్నిధానం సముదాయాల ప్రాంతంలో ఆయన మోదుగ‌, శ్రీ‌గంధం, మారేడు, ఉసిరి, తుల‌సి మొక్క‌లు నాటారు.

 

 

 

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా భూతాపం(గ్లోబ‌ల్ వార్మింగ్‌) పెరిగి వ‌ర్షాలు కుర‌వ‌క‌ ప్ర‌జ‌లు క‌రువుకాట‌కాల‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణను ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా తీసుకోవాల‌న్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు శేషాచ‌ల అడ‌వుల‌ను ఆవాసంగా ఎంచుకోవ‌డం మ‌న అదృష్టమ‌ని, ఇక్క‌డ విభిన్న వ‌న్య‌ప్రాణులు, ఔష‌ధ మొక్క‌లు, అనేక జాతుల వృక్షాలు కొలువుదీరి ఉన్నాయన్నారు. తిరుమ‌ల చుట్టుప‌క్క‌ల ఉన్న అడ‌వుల‌ను, వ‌న్య‌ప్రాణుల‌ను సంర‌క్షించ‌డం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డానికి టిటిడి అనేక చ‌ర్య‌లు తీసుకుంటోందన్నారు.

 

 

 

ప్ర‌పంచంలోనే అరుదుగా ల‌భించే ఎర్ర‌చంద‌నం వృక్షాలు శేషాచ‌లం కొండ‌ల్లో ఉన్నాయ‌ని వివ‌రించారు. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న 2 నెల‌ల కాలంలో ప‌రిశ్ర‌మ‌ల నుంచి, వాహ‌నాల నుంచి కాలుష్యం వెలువ‌డ‌కపోవ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం ఎంత‌బాగా ఉండేదో అంద‌రూ చూశామ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తిజ్ఞ చేసి త‌మ ఇళ్లు, కాల‌నీలు, గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో మొక్క‌లు నాటి వాటిని సంర‌క్షించ‌డాన్ని ఒక ఉద్య‌మంగా చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డిఎఫ్‌వో   ఫ‌ణికుమార్ నాయుడు, ఎఫ్ఆర్వో   శివ‌కుమార్, అట‌వీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

జూన్ 8 నుండి శ్రీ‌వారి పునర్దర్శ‌నం

Tags: All the people will feel comfortable when the floor is cold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *