All those who deserve it

అర్హులందరికి పక్కాగృహాలు

– జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు

Date:04/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు అర్హులందరికి పక్కాగృహాలు ఇవ్వడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు తెలిపారు. బుధవారం మున్సిపాలిటిలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి , కమిషనర్‌ కెఎల్‌.వర్మతో కలసి నక్కబండ, భీమగానిపల్లెలోఇండ్ల స్థలాలను పరిశీలించారు. కార్యాలయంలో ఆన్‌లైన్‌లో నవశకం క్రింద రేషన్‌కార్డుల జాబితాలను పరిశీలించారు. ఆన్‌లైన్‌ లో జాబితాలను పెండింగ్‌లో లేకుండ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా అన్నిశాఖల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు , సిబ్బంది పాల్గొన్నారు.

అక్కిసాని బాస్కర్‌రెడ్డి జన్మదిన సంబరాలు

Tags: All those who deserve it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *