ఖాళీ పోస్టులన్నీ భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి

– ఏపీ  ఎమ్మిగనూరు ఉద్యోగాల పోరాట కమిటి డిమాండ్

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి కన్వీనర్  సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివైఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్, పి.డి.ఎస్.యు, ఎస్ఎఫ్ఐ, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పి.డి.ఎస్.యు, ఏపీ ఎస్ ఎఫ్, ఆర్ ఏ విఎఫ్, ఆర్ యుఎస్ ఎఫ్, రౌండ్ టేబుల్ సమావేశంలో  వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూసీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కలిపి ఒకే నోటిఫికేషన్లో విడుదల చేస్తామని ఈరోజు రెండు సంవత్సరాల కాలంలో కేవలం 10143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ మాత్రమే ప్రకటించారు.పీజీలు పీహెచ్ డీలు డిగ్రీలు చదువుకొని ఎస్సై కానిస్టేబుల్ గ్రూప్,డిఎస్ సి కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే 36,450 డీఎస్సీ  ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే నిరుద్యోగులను నట్టేట ముంచటం అని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 40 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు సదస్సులు నిర్వహించి ఆయన ప్రభుత్వం దిగిరాకపోతే లక్షలాది మంది నిరుద్యోగులతో నిర్వహిస్తాం.చదువుకొని ఉద్యోగాలు లేక అర్ధాకలితో కోచింగ్ సెంటర్లు స్టడీ హాల్స్ చూట్టు  సంవత్సరాల తరబడి తిరుగుతుంటే ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థీ యువజన నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: All vacant posts should be given notifications for replacement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *