Natyam ad

పుంగనూరు ఘటనలో బాధితులంతా పోలీసులే – డీఐజీ అమ్మిరెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:

శుక్రవారం పుంగనూరులో జరిగిన ఘటనపై స్పందించారు డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి. నిన్నటి ఘటనలో పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు.ఈ ఘటనలో బాధితులంతా పోలీసులేనని అన్నారు. ఈ ఘటనలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని.. మరో 20 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు డిఐజి.హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ దాడి వెనుక సీరియస్ కుట్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మారణాయుధాలతోనే వారు ఉద్దేశపూర్వకంగా మాపై దాడికి యత్నించారని అన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందన్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

 

Post Midle

Tags: All victims of Punganur incident are policemen – DIG Ammireddy

Post Midle