Natyam ad

ఆళ్లగడ్డ ఎవరి అడ్డా

కర్నూలు ముచ్చట్లు:


ఎలాగైనా తన తల్లి విజయం సాధించిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించాలని అఖిలప్రియ పట్టుదలతో ఉన్నారు. బంధుగణం ఎక్కువగా ఉండటంతో పాటు అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న కలిగి ఉన్న ఆళ్లగడ్డను వదిలేందుకు ఆమె ఇష్టపడటం లేదు. నంద్యాలకు వెళతారన్న ఊహాగానాలు ఆమె అనుచరులు కొట్టిపారేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆళ్లగడ్డ నుంచే పోటీ చేయడానికి అఖిలప్రియ సిద్ధమవుతున్నారు. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే ఆమె ఆళ్లగడ్డలో మరింత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. 2014లో ఆళ్లగడ్డ, నంద్యాల రెండు సీట్లు భూమా కుటుంబం ఖాతాలోనే పడ్డాయి. ఆళ్లగడ్డ నుంచి భూమా శోభానాగిరెడ్డి, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. శోభానాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి కూడా మరణించారు. భూమా కుటుంబం వైసీపీని వీడి టీడీపీలో చేరింది. దీంతో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి (భూమా నాగిరెడ్డి సోదరుడు కుమారుడు) శిల్పా మోహన్ రెడ్డి మీద విజయం సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను భూమా కుటుంబం కోల్పోయింది. ఆళ్లగడ్డలో గంగుల కుటుంబాన్ని రంగంలోకి దింపిన వైసీపీ విజయం సాధించింది. గంగుల కుటుంబం ఎప్పటి నుంచో ఆళ్లగడ్డపై పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ఉంది.

 

 

1985లోనే గంగుల కుటుంబం ఆళ్లగడ్డ నుంచి గెలిచింది. ఆ తర్వాత 2019 వరకూ ఆ కుటుంబానికి గెలుపు పిలుపు వినిపించలేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత గంగుల ఇంట్లో గెలుపు బాజాలు వినిపించాయి. గత ఎన్నికల్లో గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. దీంతో పాటు అక్కడ అఖిలప్రియకు బంధువర్గమంతా దూరమయింది. ఆమె పెళ్లి తర్వాత బంధుగణంతో పాటు భూమా నాగిరెడ్డి అనుచరులు కూడా అఖిలప్రియకు దూరమయ్యారు. మంత్రి పదవిలో ఉన్నంతకాలం ఆమె లెక్క చేయకపోవడంతోనే ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  ఇప్పుడు బంధుగణాన్ని తిరిగి తన దరిచేర్చుకుని పనిలో అఖిలప్రియ ఉన్నారు. దూరమయిపోయిన భూమా కిశోర్ రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి, భూమా వీరభద్రా రెడ్డిలను కూడా బుజ్జగిస్తున్నారని తెలిసింది. అవసరమైతే చంద్రబాబు చేత వారికి హామీ ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక తన సోదరుడు జగద్విఖ్యాతరెడ్డితో భూ వివాదాలు తలెత్తినా వాటిని కూడా సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గంగుల కుటుంబం కూడా ఆళ్లగడ్డపై పట్టు సాధించింది. ఈసారి ఆళ్లగడ్డలో ఇద్దరికీ గెలుపు ఆషామాషీ కాదు. ఎవరు గెలిచిన తక్కువ మెజారిటీతో గెలుస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పోరు హోరాహోరీ కొనసాగుతుంది. గంగుల కుటుంబం కూడా అన్ని రకాల వ్యూహాలతో సిద్ధంగా ఉంది. మరి చూడాలి ఈసారి గెలుపు ఎవరిదన్నది?

 

 

Post Midle


మెడికల్ కాలేజీల రచ్చ
పీ అసెంబ్లీలో మెడికల్ కాలేజీ లపై జరిగిన చర్చ నంద్యాలను కుదిపేస్తోంది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం అగ్గి రాజేస్తోంది ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో శిల్ప .. భూమా కుటుంబాల మధ్య విభేదాలు రాయలసీమ ప్రజలకు బాగా తెలుసు..ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొకరు మరో పార్టీలో చేరాల్సిందే. వైసీపీలో ఉన్న భూమా కుటుంబం..అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా, అంతవరకు బాబు పంచన ఉన్న శిల్ప కుటుంబం..వెంటనే వైసీపీలో చేరింది.. ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్‌ అవసరం లేదు.. ప్రస్తుతం మళ్లీ రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజుకుంది.. నంద్యాల మెడికల్‌ కాలేజీ ఈ అగ్నికి ఆజ్యం పోస్తోంది. పనిలో పనిగా పాత పగల్ని తవ్వుకుంటూ..కొత్త ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ల గొడవేంటంటే..రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.. అందులో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఒకటి. ఈ మెడికల్ కాలేజీ 500 కోట్లతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూములలో నిర్మాణం జరుగుతోంది..పిల్లర్స్ వేస్తున్నారు.ఈ సమయంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మెడికల్ కాలేజీ సమీపంలో..

 

 

 

శిల్ప కుటుంబానికి 30 ఎకరాల భూములు ఉన్నాయని..మెడికల్ కాలేజీ రాగానే వాటి విలువ భారీగా పెంచుకున్నారని ఆరోపిస్తున్నారు.. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శిల్ప కుటుంబం పదేపదే కృతజ్ఞతలు చెబుతోందని భూమా అఖిలప్రియ అంటున్నారు.దీనిపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఘాటుగా స్పందించారు. ఆళ్లగడ్డలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ ను తీసివేసి తమ పొలాల పక్కన నిర్మించుకున్నారని శిల్పా రవి ఆరోపించారు. ఆ బస్టాండ్ పనికి రాకపోవడంతో.. పాత ఆర్టీసీ బస్టాండ్‌నే కొనసాగిస్తున్నారని..దీనిపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసని ఎమ్మెల్యే శిల్పా రవి మండిపడ్డారు.తమ పొలాల దగ్గర నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను భూమా కుటుంబమే లీజుకి తీసుకున్నదని ఆరోపించారు . తమ భూములు నంద్యాల టౌన్ లోనే ఉన్నాయని, వాటికి ఎవరు ధరలు పెంచాల్సిన అవసరం లేదని అఖిలప్రియ బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని హెచ్చరించారు. ఇలా మెడికల్‌ కాలేజీ పుణ్యమా అని ఇరువర్గాల మధ్య రాజకీయం వేడెక్కింది.. ఇది ఎంత వరకు దారి తీస్తుందోనని రెండు పార్టీల కార్యకర్తలు సీరియస్‌గా చర్చించుకుంటున్నారు.

 

Tags:Allagadda is someone’s father

Post Midle

Leave A Reply

Your email address will not be published.