Natyam ad

పస లేని పచ్చ నేతల ఆరోపణలు- కొట్టి పారేసిన ఎస్ఐ మోహన్ కుమార్

పుంగనూరు ముచ్చట్లు:

చంద్రబాబు నాయుడు పర్యటనలో వ్యూహం ప్రకారం పోలీసులపై దాడి చేసి సుమారు 50 మందిని తీవ్రంగా గాయపరిచిన పచ్చనేతల తాజాగా పసలేని ఆరోపణలు పోలీసులపై, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పైన చేయడంతో ఎస్సై మోహన్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఆర్జే. వెంకటేష్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆర్జే .వెంకటేష్ తాను అమెరికాలో ఉండగా తనపై పుంగనూరు పోలీసులు తప్పుడు కేసులు బనాయించాలని పేర్కొనడం పై ఎస్సై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఆర్జే .వెంకటేష్ ఆరోపించిన మేరకు ఆయనపై పుంగనూరులో ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని స్పష్టం చేశారు. పథకం ప్రకారం పోలీసులపై దాడులు చేసి, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసి తిరిగి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. పోలీసులపై దాడుల సమయంలో సీసీ ఫుటేజ్ లు, వీడియోలు ఫోటోలను పరిశీలించి బాధ్యులైన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నామని ఏ ఒక్కరిపై కూడా తప్పుడు కేసులు నమోదు చేయలేదని ,అలా చేయాల్సిన అవసరం పోలీసులు లేదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజకీయ లబ్ధి కోసం పోలీసులు వినియోగించుకోవద్దని హెచ్చరించారు.

 

Post Midle

Tags:Allegations of green grass leaders – SI Mohan Kumar who was beaten up

Post Midle