బాబు క్యాడర్‌ను బలోపేతం చేసుకునేందుకు ఆరోపణలు – ఎంపీ మిధున్‌రెడ్డి

– తెలుగుదేశంకు ఓటింగ్‌శాతం తగ్గింది
– వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి
 
పుంగనూరు ముచ్చట్లు:
 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పై విశ్వాసంతో ప్రజలు అత్య్యధిక మెజార్టీతో గెలిపించారని, తెలుగుదేశంకు ఓటింగ్‌శాతం తగ్గడంతో మతిబ్రమించి చంద్రబాబునాయుడు క్యాడర్‌ను బలోపేతం చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి పుంగనూరు మున్సిపాలిటిలో మూడవ రోజు వార్డు బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎంపీ మిధున్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడుకు అసెంబ్లి ఎన్నికల తరువాత కుప్పం ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పూర్తిగా పడిపోయిందన్నారు. దీని కారణంగా పార్టీ క్యాడర్‌ విచ్చిన్నమైందన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పథనమైందని , ముందస్తు ఎన్నికలు వస్తుందని అపద్దాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజాసంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మరో రెండు సంవత్సరాలు ఎనలేని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు, ప్రకటనలు మానుకోవాలని సూచించారు. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పురాక పోవడం గమనార్హమని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.
 
Tags: Allegations to strengthen Babu cadre – MP Midhunreddy

Leave A Reply

Your email address will not be published.