అడగుడుగునా అడ్డంకులు…ఏలూరు రూల్స్

Allegro Rules ... Eluru Rules

Allegro Rules ... Eluru Rules

 Date:14/07/2018
ఏలూరు ముచ్చట్లు:
నగరంలో కొత్త ట్రాఫిక్‌ నిబంధనలను అమలు చేస్తున్నారు. నగరంలో కొత్తగా అమలు చేస్తున్న ట్రాఫిక్‌ నిబంధనలు ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించాల్సింది పోయి వాహనచోదకులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టాయి. ట్రాఫిక్‌ పోలిసింగ్‌ విభాగంలో ఉన్నతాధికారులు మారిన ప్రతిసారీ నగరంలో కొత్తకొత్త ట్రాఫిక్‌ నిబంధనలను విధిస్తూ వాహనచోదకులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర విమర్శ ఉంది. ఇప్పుడు కూడా అదే విధంగా అధికారులు చేయడం ఆ విమర్శకు బలం చేకూర్చింది. నగరంలో స్థానిక పాతబస్టాండు ప్రాంతం నుంచి ఫైర్‌ స్టేషన్‌ సెంటరు వరకూ కీలకమైన రహదారిగా చెప్పొచ్చు. ఈ రహదారిలో కొన్ని రోడ్ల వద్ద డివైడర్ల వద్ద మలుపులు తిరిగేందుకు వీలుగా రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డును నిర్మించే సమయంలో ఇంజినీరింగ్‌ అధికారులు పలు విధాలుగా ఆలోచించి ట్రాఫిక్‌ సమస్యలను గుర్తించి మరీ నిర్మించారు. ఈ రోడ్డును నిర్మించి ఏళ్లు గడిచినా నేటి వరకూ ఏ ట్రాఫిక్‌ సమస్య రాలేదు. కానీ నేడు ఈ రోడ్డులో ఈ డివైడర్ల వద్దనున్న మలుపుల వల్లే ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయని అధికారులు భావించారు. ఇక అనుకున్నదే తడవుగా స్థానిక పాతబస్టాండు వద్ద ఏకంగా బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. వాహనదారులకు వన్‌వే ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానిక వసంతమహాల్‌ సెంటరులోనూ, కర్రల వంతెన వద్ద కూడా బారీగేట్లతో రోడ్డు మలుపును మూసివేశారు. ఈ ప్రాంతాల్లో పోలీసులను కూడా ఏర్పాటు చేసి అటువైపుగా ఎవరినీ వెళ్లనీయకుండా చేస్తున్నారు. దీనివల్ల వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కర్రల వంతెన వద్ద మలుపు తిరిగేందుక వీలుగా రోడ్డు ఉండేది. అక్కడ బారీగేట్లను ఏర్పాటు చేయడంతో స్థానిక జూట్‌మిల్లు అంటే సుమారు కిలోమీటరు దూరం వెళ్లి అక్కడ మలుపు తిరగాల్సి వస్తుంది. దీంతో వాహనచోదకుల సమయంతో పాటుగా ధనం కూడా వృథా అవుతుంది. పోనీ ఈ నిబంధనలను అమలు చేసిన తర్వాత దానిపై వాహన చోదకులకు అవగాహన కల్పించారా? అంటే అదీ లేదు. ఎవరైనా తెలియకుండా పొరపాటుగా అటుగా వస్తే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు విరుచుకు పడిపోతున్నారు. నీకు నిబంధనలు తెలియవా?కళ్లు కనపడడం లేదా? అంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని చెప్పిన అధికారులు మరీ ఆ నిబంధనల గురించి వాహనచోదకులకు అవగాహన కల్పించాలని, దానికి గానూ సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని గానీ తెలియకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తమ సొంత భావాలను రూల్స్‌గా మార్చి తమపై రుద్దుతున్నారని పలువురు వాపోతున్నారు.
అడగుడుగునా అడ్డంకులు…ఏలూరు రూల్స్https://www.telugumuchatlu.com/allegro-rules-eluru-rules/
Tags:allegro-rules-eluru-rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *