పొత్తు ముఖ్యం..సీట్లు కాదు : సీఎం చంద్రబాబు

Alliance is important, not sisters: CM Chandrababu

Alliance is important, not sisters: CM Chandrababu

Date:22/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తాను టీటీడీపీ నేతలకు అండగా ఉంటానని, టచ్ లోనే ఉంటానని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. సోమవారం నాడు  టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణ నేతలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత రమణ, నామాలదేనని అన్నారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరో 6 సీట్లు అడుగుదామన్నారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతానని నేతలకు బాబు తెలియజేశారు.
మనకు పొత్తు ముఖ్యమని, సీట్లు కాదని అన్నారు. బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేద్దామన్నారు. సీట్లు  రానిచోట్ల కూడా మన క్యాడర్ గెలుపు కోసం కృషిచేయాలని నేతలకు సూచించారు. మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. టికెట్ తెలంగాణలో ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీపీ ఆశావహుల నుంచి బయోడేటాలను స్వయంగా చంద్రబాబు తీసుకున్నారు.
Tags:Alliance is important, not sisters: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *