Allocate houses and plots of land to the deserving poor.

అర్హులైన పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాలు కేటాయించాలి..

-లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను స్వాధీనం చేయాలి.

-ఈనెల 20 నుండి సిపిఐ ఉద్యమం..

-సిపిఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య .

Date:18/10/2020

కడప ముచ్చట్లు:

అర్హులైన పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఉద్యమ చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో షేర్ వాల్ టెక్నాలజీ తో జి ప్లస్ త్రీ (జి+3) ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి కడప జిల్లాలో లో దాదాపు 155 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం పూర్తిచేసిన ఇళ్లను డబ్బులు కట్టిన లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 16 నెలలుగా పేదల గూడు పట్ల మీనమేషాలు లెక్క వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. టిడ్కో లబ్ధిదారులకు నెంబర్ల వారీగా ప్లాట్ లు కేటాయించినప్పటికీ ఇతర మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసి స్వాధీనం చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని రోడ్లు,కరెంటు వైరింగ్ ,నీటి సరఫరా తదితర వసతుల కల్పన వెంటనే పూర్తి చేయాలన్నారు. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ,ఎర్రగుంట్ల, రాయచోటి, రాజంపేట ,బద్వేల్, పులివెందుల, మైదుకూరు, పట్టణాల్లో మొత్తం 19,232 ఇల్లు మంజూరైతే కేవలం 12,907 మాత్రమే గత ప్రభుత్వ హాయంలో పూర్తయినాయి కాబట్టి నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ప్రభుత్వం స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.300,360,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ టిడ్కో పర్యవేక్షణలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండర్ల ద్వారా కాలయాపన చేస్తున్నదని వారు విమర్శించారు.

 

 

 

బ్యాంకులకు డబ్బులు చెల్లించే అవసరం లేకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను పూర్తి ఉచితంగానే పేదలకు ఇస్తామని చెప్పి నేడు ఆ మాటలు మరిచారని వారు ఆరోపించారు.. నవరత్నాలు లో భాగంగా అర్హులైన పేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని హంగులతో సౌకర్యవంతమైన ఇల్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమo పట్ల చిత్తశుద్ధి కరువైందని వారు విమర్శించారు. చాలీచాలని ఇరుకు స్థలాల్లో పేదల నివాసాలు సరికాదని నగర, పట్టణ ప్రాంతాల్లో కనీసం రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు గంటల 3 సెంట్లు చొప్పున ప్రభుత్వం పంపిణీ కి సిద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు. కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక హక్కులు గా కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వం గుర్తించబడి ముఖ్యంగా పేదలకు గూడు సమకూర్చేందుకు సిపిఐ నేతృత్వంలో అనేక మార్లు ఇళ్లస్థలాలు పోరాటాలు నిర్వహించామన్నారు. అర్హులైన పేదలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేక సంవత్సరాల తరబడి అద్దె ఇళ్లల్లో మగ్గిపోతు అద్దెలు కట్ట లేక ఊహించని ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో సామాజిక న్యాయం దిశగా ఇల్లు ఇంటి స్థలాల పంపిణీపై జగన్ ప్రభుత్వం నిక్కచ్చిగా చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.
ఇల్లు ఇంటి స్థలాల పట్ల ప్రభుత్వ తిరోగమన చర్యలపై ఈనెల 20వ తేదీ నుండి వివిధ రూపాల్లో నిరసనలు, ఇళ్ళు స్వాధీన కార్యక్రమాలు ఉంటాయని ఈ ఇళ్ల స్థలాల పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కృష్ణమూర్తి నగర కార్యదర్శి యన్. వెంకట శివ పాల్గొన్నారు.

ఇది చారిత్రాత్మకం..

Tags: Allocate houses and plots of land to the deserving poor.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *