వంజరలకు ఆత్మ గౌరవ భవనం నిర్మాణానికి స్థలం, నిధులు  కేటాయించాలి

వంజరి కులస్తులకు ప్రత్యెక ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలి
తెలంగాణా వంజరి సేవా సంఘం రాష్ట్ర అద్యక్షులు యదుగాని శంకర్ నారాయణ విజ్ఞప్తి
హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వివిధ బిసి కులాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు నిధులు కెటాయిస్తు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణా రాష్ట్ర వంజరి సేవా సంఘం స్వాగతించింది.వివిధ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సంఘం రాష్ట్ర అద్యక్షులు యదుగాని శంకర్ నారాయణ హర్షం వ్యక్తం చేసారు.ప్రతి కులానికి ప్రభుత్వమే భవనాలు నిర్మించాలను కోవడం, విద్య,వికాస, సాంస్కృతిక కేంద్రాలుగా వాటిని తీర్చి దిద్దాలనుకోవడాన్ని  స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల జనాబా కలిగి ఉన్న వంజరులు ప్రత్యెక తెలంగాణా రాష్ట్రము కోసం చేసిన పోరాటం లో కీలక పాత్ర పోషించినట్లు శంకర్ నారాయణ తెలిపారు. ఇదే క్రమం లో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి అన్ని కులాల వారికి మాదిరిగా వంజర కులస్తులకు కుడా హైదరాబాద్  నగరం లో ఆత్మ గౌరవ భవనం నిర్మాణానికి స్థలం , నిధులు  కేటాయించాలని శంకర్ నారాయణ విజ్ఞప్తి చేసారు.వంజరి కులస్తులకు ప్రత్యెక ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి ప్రత్యెక పతకాల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.అలాగే ప్రబుత్వ నామినేటేడ్ పదవుల్లో కుడా ప్రాతినిద్యం కల్పించలని కోరారు.ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రము లో వంజరలను ఎస్టి జాబితానుండి తొలిగించి బిసి (డి) జాబితాలోకి మార్చారని, దానిని తిరిగి ఎస్టి జాబితాలోకి పునరుద్దరించాలని శంకర్ నారాయణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Allocate space and funds for the construction of a self-respecting building for the Wanjars

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *