క్రీడా నిధులు కేటాయించండి

Date:14/07/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

కేంద్ర క్రీడా,  యువజన సర్వీసుల శాఖ మంత్రి   కిరణ్ రిజిజు మంగళవారం  దక్షిణాది రాష్ట్రాల క్రీడా,  యువజన సర్వీసుల శాఖల మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి   శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్ లోని తన కార్యాలయం నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నారన్నారు. కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపు చేయాలని మంత్రి  కేంద్ర మంత్రి ని ఈ సందర్భంగా కోరారు.  రాష్ట్రంలో క్రీడాకారులకు 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటం తో పాటు ఉన్నత విద్య అభ్యసించి క్రీడాకారుల కొసం 0.5 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 250 ఎకరాలు విస్తీర్ణం లో క్రీడా పాఠశాల ఉందన్నారు. క్రీడా పాఠశాలలో మౌళిక వసతులను కల్పించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి   సభ్యసాచి ఘోష్, క్రీడా, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి  రఘునందన్ రావు, సంయుక్త కార్యదర్శి   రమేష్, ఎన్వైకేఎస్  డైరెక్టర్ అన్షుమన్ ప్రసాద్ దాస్,   సెట్విన్ ఎండీ   వేణు గోపాల్, క్రీడా, యువజన శాఖ ఉన్నతాధికారులు  సుజాత, విమాలాకర్, ధనలక్ష్మి, చంద్రారెడ్డి లు పాల్గొన్నారు.

 

వడ్డీలకే పరిమితమవుతున్న భీమా సొమ్ము

Tags:Allocate sports funds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *