గోడేకి ఖబర్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

Date:28/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  చేతుల మీదగా గోడేకి ఖబర్ వద్ద ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లాటరీ సిస్టంలో ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు కలెక్టర్ శ్వేత మహంతి పాల్గొన్నారు. 192 డబల్ బెడ్ రూమ్ నిర్మాణంలో ఉండగా 139 ఇండ్లను ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం వృద్ధులు మరియు వికలాంగులకు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.బుధవారం నాడు ఒక దినపత్రికలో  వచ్చిన కథనానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. జియాగూడ లో దళారులు రెచ్చిపోతున్నారు అని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, ప్రజలు అలాంటి వాళ్లను నమ్మకూడదు అని మంత్రి తెలిపారు.

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

Tags: Allocation of double bedroom houses in Godeki Khabar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *