Allocation of space to the gas cylinder manufacturing industry

గ్యాస్‌ సిలిండర్ల తయారీ పరిశ్రమకు స్థలం కేటాయింపు

– రెండు రిజర్వాయర్ల ఏర్పాటు
– 700 మందికి పైగా ఉపాధి
– ఎంపీ మిధున్‌రెడ్డి

Date:25/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు మాట ఇచ్చిన మేరకు పుంగనూరులో గ్యాస్‌ సిలిండర్ల తయారీ పరిశ్రమకు స్థలం కేటాయించినట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, డీసీసీబి చైర్మన్‌ రెడ్డెమ్మతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ పుంగనూరులో గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమ కోసం 35 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. 700 మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలోనే పరిశ్రమ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి మంచినీటిని కొళాయిల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు. ఇందుకోసం గండికోట రిజార్వయర్‌ నీటిని తరలిస్తామన్నారు. వారట్‌గ్రిడ్‌ను 10 సంవత్సరాలు పాటు కాంట్రాక్టర్‌ నిర్వహించి, నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి జిల్లాను సస్యశామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అలాగే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు రెండు రిజర్వాయర్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని నేతిగుట్లపల్లె వద్ద నిర్మించే రిజర్వాయర్‌లో ఒక టిఎంసీ నీటిని నిల్వ చేసి మదనపల్లె, నిమ్మనపల్లె, పుంగనూరు మండలాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. అలాగే సోమల మండలం దేవలకుప్పం వద్ద మూడన్నర టిఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించేందుకు అనుమతులు మంజూరైందన్నారు. త్వరలోనే జ్యూడిషియల్‌ రివచ్వీకు పంపి పనులు చేపడుతామన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ సామార్థ్యాన్ని పెంపు చేసి, నీటిని చెరువుల్లోకి విడుదల చేసి, రైతులకు నీటి సమస్య లేకుండ చేస్తామన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు నీటిని అదనంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నడు లేని విధంగా నియోజకవర్గంలో సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగిందన్నారు. అలాగే నాడు-నేడు పథకం క్రింద పాఠశాలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు. పుంగనూరు ప్రభుత్వాసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో రాజకీయ కక్షలతో పుంగనూరు అభివృద్ధికి నోచుకోకుండ పోయిందన్నారు. ప్రస్తుతం అవకాశాన్ని ప్రజలు ఇచ్చారని, దీనిని సద్వినియోగం చేసుకుంటు పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి చైర్మన్‌ రెడ్డెమ్మ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ నాయకులు జంపాల శ్రీనివాసులు, నారప్పరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌, విజయభాస్కర్‌రెడ్డి, ఆవుల అమరేంద్ర, నాగేంద్ర, మనోహర్‌, అమ్ము, కిజర్‌ఖాన్‌, రేష్మా, మంజుల, అలిమ్‌బాషా,నరసింహులు, శ్రీనివాసులు, మిద్దింటి కిషోర్‌, రాజేష్‌, సురేష్‌, కుమార్‌, జెపి యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

బైపాస్‌రోడ్డు పనులను తక్షణం పూర్తి చేయాలి

Tags: Allocation of space to the gas cylinder manufacturing industry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *