కేటాయింపులు సరే… నిధుల్లేవి

Date:19/05/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయంపై కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెపుతోంది కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. బిజెపి నేతలు కేంద్రం రాష్ట్రానికేదో భిక్ష వేసినట్లు వ్యాఖ్యానాలు చేయడంపై రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎపి విభజన చట్టంలో భాగంగానే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందనీ, అది రాష్ట్ర హక్కు అని సర్వత్రా వినవస్తోంది.నిధులు కేటాయించకుండా తరగతులు నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారుఅనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న సెంట్రల్‌ యూనివర్శిటీకి సంబంధించి 2009 యూనివర్శిటీల చట్టాన్ని సవరించి చట్టబద్దత కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాలని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు చట్టబద్దత కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని కోరార. సరైన సౌకర్యాలు కల్పించకుండా జెఎన్‌టియులో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడం శోచనీయ మన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే రూ.1140 కోట్లు మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో జిల్లా స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చర్చలు జరిపి సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. మరో వైపు అనంతపురంలో నూత నంగా మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాల యంలో తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతు లను నిర్వహించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయించారు. సొంత భవనాలు నిర్మాణమయ్యేవరకు తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, జెఎన్‌టియులో తాత్కాలిక భవనాల్లో ఇందుకు సరైన స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ కేంద్రీయ యూనివర్సిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు.
Tags; Allocations are ok … fundraising

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *