Allotment of 68 buses to Punganur RTC Depot

పుంగనూరు ఆర్టీసి డిపోకు 68 బస్సులు కేటాయింపు

– ఆర్‌ ఎం చెంగల్‌రెడ్డి

Date:20/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో నిర్మిస్తున్న నూతన ఆర్టీసి డీపోకు 68 బస్సులను కేటాయించినట్లు తిరుపతి ఆర్టీసి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి , డిపో మెనేజర్‌ మద్దిలేటితో కలసి డిపో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పనులను దాదాపుగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 7 కొత్త బస్సులను పుంగనూరు నుంచి నడుపుతున్నామన్నారు. మరో 8 బస్సు రూట్‌లను పరిశీలించి బస్సులను డిపోకు కేటాయిస్తామని తెలిపారు. అలాగే మంత్రి ఆదేశాల మేరకు అవసరమైన ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే డిపోను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి నాయకులు కరీముల్లా, చంద్ర, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

స్వచ్చ సర్వేక్షణ్‌లో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరుకు దేశస్థాయిలో మూడవర్యాంకు

Tags: Allotment of 68 buses to Punganur RTC Depot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *