జర్మన్ బస్సుల కంపెనీకి భూమి కేటాయింపు
– ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ షన్మోహన్
-హర్షం వ్యక్తం చేస్తున్న జనం
పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో ప్రపంచ ప్రసిద్దిగాంచిన జర్మన్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సులు, ట్రక్కులు కంపెనీ సంస్థకు 800 ఎకరాల భూమి కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం మండలంలోని ఆరడిగుంట, మేలుందొడ్డి , వనమలదిన్నె ప్రాంతాలలో భూ సేకరణ చేపడుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులో పరిశ్రమల ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ , లోక్‌సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చర్చించారు. సీఎం అంగీకరించడంతో గత నెల 30న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బస్సుల కంపెనీ పుంగనూరులో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ మేరకు పనులు వేగవంతం చేశారు, మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం భూమి కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తొలి దశ ప్రారంభంకావడంతో పుంగనూరు నియోజకవర్గం దేశ స్థాయిలో గుర్తింపు పొందేందుకు మార్గం సుగమమైంది.
10వేల మందికి ఉపాధి….
జర్మనీలో ఉన్న పెప్పర్ మోషన్ ఎలక్డ్రికల్ బస్సులు, ట్రక్కులు, బ్యాటరీలు తయారు చేసే సంస్థ సుమారు రూ.5 వేల కోట్లతో 800 ఎకరాల్లో ప్యాక్టరీ నిర్మించనున్నారు. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనున్నది. ఈనెల 29న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో కంపెనీ ఫౌండర్లు క్రిష్టియన్‌వాగ్నర్, బ్యాస్టియన్‌ఫెడ్రిచ్, సీఈవో ఆండ్రియస్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి కలసి నిర్మాణ పనులపై చర్చించనున్నారు. త్వరలోనే పుంగనూరులో పర్యటించి కంపెనీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Tags: Allotment of land to German Buses Company
