అరవింద సమేత స్పెషల్ షోలకు అనుమతి

Allow special shows for a month

Allow special shows for a month

Date:09/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘అరవింద సమేత’. విజయదశమి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ తాజా చిత్రానికి స్పెషల్ షోలకు పర్మిషన్ లభించింది. వారం రోజులపాటు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని థియేటర్లకు కల్పించింది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా సినిమా చూడొచ్చునని నందమూరి ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను అందుకుంది. ఆ వెంటనే అదనపు షోలకు పర్మిషన్ లభించింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మూవీ కావడంతో 100 కోట్ల క్లబ్‌లో అరవింద సమేత ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tags:Allow special shows for a month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *