గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా “చావు కబురు చల్లగా”

Date:14/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం “చావు కబురు చల్లగా”. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. 2020లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించిన కార్తికేయ ఈ మూవీలో బస్తీ  బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రం గురుంచి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.

 

క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలన మీదటే మున్సిపల్ వార్డు హద్దులు నిర్ణయించాలి

 

Tags: Allu Aravind submission on Geeta Arts 2 banner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *