విశ్వమాత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం

నెల్లూరు ముచ్చట్లు:

విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో భాగంగా నెల్లూరు నగరంలోని సాయి సేవా సదన్ వేదయపాలెం సెంటర్లో ఉన్న వృద్ధాశ్రమం నందు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వమాతా సేవా ఫౌండేషన్ అధినేత్రి ధూమ్ శెట్టి కళ్యాణి మాట్లాడుతూ నా చిన్ననాటి స్నేహితురాలు జలకం సుధారాణి  జన్మదినం సందర్భంగా ఆమె సహకారం తో వృద్ధులకు పండ్లు మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో విశ్వమాత సేవా ఫౌండేషన్ సభ్యులైన రాధమ్మ, వెంకీ ,మహేష్ ,సుమన్  పాల్గొనడం జరిగిందని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం పుట్టినరోజు జరుపుకున్న జలకం సుధారాణికి( డిప్యూటీ తహసిల్దార్ నెల్లూరు) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు . ఆమె ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని ఆ భగవంతున్ని ఆశీస్సులు ఉండాలని కోరారు .మానవసేవే మాధవసేవగా ప్రతి ఒక్కరూ ఇటువంటి శుభకార్యాల సందర్భంగా వివిధ ఆశ్రమాలలో ఆశ్రయం పొందుతున్న అనాధలకు, వృద్ధులకు, వికలాంగులకు ,వితంతువులకు తమ సేవలు అందించాలని కోరారు.

 

Tags: Alms for the elderly under the auspices of Vishwamata Seva Foundation

Leave A Reply

Your email address will not be published.