అలోక్ వర్మ ఉద్యోగానికి రాజీనామా

Alok Verma resigned from job

Alok Verma resigned from job

Date:11/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మళ్లీ తప్పించడంతో అలోక్ వర్మ మనస్తాపానికి లోనయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవన్నారు. సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదం కీలక మలుపు తిరిగింది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మపై రెండో రోజే వేటు పడింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆ పదవి నుంచి అలోక్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను అగ్నిమాపక శాఖ డీజీగా ట్రాన్స్‌ఫర్ చేస్తూ సెలక్షన్ కమిటీ గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. కానీ ఫైర్ సర్వీస్‌లో చేరడానికి అంగీకరించని అలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవని వర్మ తెలిపారు.వాస్తవానికి వర్మ పదవీ కాలంలో జనవరి 31తో ముగియనుంది. అలోక్ వర్మ స్థానంలో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన నాగేశ్వర రావు… వర్మ చేసిన బదిలీలను నిలిపేశారు.
Tags:Alok Verma resigned from job

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *