దుమ్ము రేపిన ఆల్టో అమ్మకాలు

Date:23/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
దేశీయ విక్రయాల్లో మారుతీ సుజుకీ మరోసారి సత్తా చాటింది. ఫిబ్రవరి నెలలో ఎక్కువగా అమ్ముడైన వినియోగదారుల వాహనాల్లో మారుతి సుజుకీకి చెందిన ఎంట్రీలెవల్‌ ‘ఆల్టో’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌(సియామ్‌) ఒక డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరిలో 24,751 యూనిట్ల ఆల్టో కార్లు విక్రయమయ్యాయి. అంతేకాకుండా అధికంగా అమ్ముడైన వాహనాల్లో వరుసగా టాప్‌-6 వాహనాలు మారుతి సుజుకీ వాహనాలు ఉన్నట్లు సియామ్‌ తెలిపింది. మారుతి సుజుకీ తర్వాత రెండోస్థానంలో మారుతి హాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ నిలిచింది. ఫిబ్రవరిలో 18,224 యూనిట్ల స్విఫ్ట్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే కంపెనీకి చెందిన హాచ్‌బ్యాక్‌ బాలెనో(17,944 యూనిట్లు) మూడో స్థానంలో, డిజైర్‌(15,915 యూనిట్లు) నాలుగో స్థానంలో, వేగానర్‌ (15,661 యూనిట్లు) ఐదో స్థానంలో, విటారా బ్రెజా(11,613 యూనిట్లు) ఆరో స్థానంలో నిలిచినట్లు సియామ్‌ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మరో బ్రాండ్‌ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌కు చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ఎలైట్‌ ఐ20 ఏడో స్థానంలో నిలవగా.. క్రెటా ఎనిమిదో స్థానం, గ్రాండ్‌ ఐ10 తొమ్మిదో స్థానం.. టాటా మోటర్స్‌ టియాగో 8 దక్కించుకున్నాయి. ఈ సారి టాటామోటార్స్‌ కూడా 8,286 యూనిట్ల విక్రయాలతో టాప్‌-10లో చోటు దక్కించుకుంది.
Tags; Alto sales of dusty dust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *