Natyam ad

భార్యా మామలపై అల్టుడి దాడి

అన్నమయ్య ముచ్చట్లు:

 


భార్యా, మామ పై అల్లుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో నేటి ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ములకలచెరువు మండలం రాజుగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ కుమార్తె అపూర్వ అదే గ్రామానికి చెందిన దేవరాజును ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల చంద్రశేఖర్ కు టమోటాలలో వచ్చిన రెండు లక్షల రూపాయలను అల్లుడు దేవరాజు చోరీ చేసి వాడుకున్నాడని అతని అత్త ఆరోపించింది. ఈ విషయమై అతడిని అడుగగా తమ కుమార్తెను కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం పొలం నుంచి ఇంటికి వెళ్తున్న అపూర్వ, అడ్డు వచ్చిన ఆమె తండ్రి పై దేవరాజు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారీ అయ్యాడు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

 

Tags: Altudi attack on wife and uncle

Post Midle
Post Midle